
నషా ముక్త యువ అభియాన్
తెలంగాణలో అవగాహన ఉద్యమం
ప్రధాని పిలుపు మేరకు, డా. గొంగూర (GV) 100 రోజుల ప్రత్యేక అవగాహన సిరీస్
Nasha Mukt Yuva for Viksit Bharat — 100-Day Awareness Series by Dr Gongura (GV)
National Campaign
జాతీయ అభియానం గురించి
PM Modi launched the 'Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan' on 2 August 2026 — a 100-week nationwide Jan Bhagidari campaign.
2026 ఆగస్టు 2న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అభియాన్‌ను ప్రారంభించారు.
ఇది 100 వారాల దేశవ్యాప్త జన్ భాగిదారీ ఉద్యమం — ప్రతి ఆదివారం కార్యక్రమాలు.
స్పోర్ట్స్, వాకథాన్స్, ధ్యానం, నుక్కడ్ నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారం.
10,000+ ప్రాంతాలు; MY Bharat వాలంటీర్లు, NSS, పాఠశాలలు, కళాశాలలు, 125+ భాగస్వామ్య సంస్థలు.
యువ ఆరోగ్యాన్ని 'వికసిత భారత్ 2047' దృష్టితో అనుసంధానించే లక్ష్యం.
వనరు: pmindia.gov.in • pib.gov.in (ఆగస్టు 2026)
Nasha Mukt Telangana — తేదీ వారీ కార్యక్రమాలు
అవగాహన కార్యక్రమాల వివరాలు
తెలంగాణలో నషా ముక్త యువ అభియాన్ కింద నిర్వహించిన తేదీ వారీ అవగాహన కార్యక్రమాలు మరియు వార్తా పత్రికల ప్రచురణలు.
నషా ముక్త భారత్ అభియాన్ — బృహత్ అవగాహన కార్యక్రమం — ASR స్కూల్ & కళాశాల, ఖమ్మం
నషా ముక్త భారత్ అభియాన్ కింద ASR స్కూల్ & కళాశాల, ఖమ్మం వద్ద నిర్వహించిన బృహత్ అవగాహన కార్యక్రమంలో డా. గొంగూర వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మత్తు పదార్థాల ప్రమాదాల గురించి వివరించారు. భవిష్యత్తు ఉన్నత జీవితానికి మంచి జీవనశైలి, ఆరోగ్యం అవసరమని సందేశం అందించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, మంచి జీవనశైలిని అలవర్చుకోండి. ఆరోగ్యమే భవిష్యత్తు విజయానికి పునాది.
— డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
పాల్గొన్న ప్రముఖులు
డా. గొంగూర వెంకటేశ్వరరావు (Dr GV)
శ్రీ రక్షా హాస్పిటల్ — ముఖ్య వక్త
శ్రీ బాలనందం
స్కూల్ హెడ్ మాస్టర్, ASR స్కూల్
శ్రీ గోవిందు రావు
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
శ్రీ ఖలీల్ అహ్మద్
3H ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు
శ్రీ గజ్జల శ్రీనివాస్
హాజరు
శ్రీ అటుకూరి నాగేశ్వరరావు
హాజరు
శ్రీ అరుణ్ కుమార్
హాజరు
విద్యార్థులు
ASR స్కూల్ & కళాశాల, ఖమ్మం
మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన శిబిరం — శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం (ABVP నిర్వహణ)
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ABVP ఖమ్మం నిర్వహించిన అవగాహన శిబిరంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ వ్యసన ప్రమాదాలు, భవిష్యత్తుపై పడే ప్రభావం గురించి వివరించారు. 'SAY NO TO DRUGS, SAY YES TO A BRIGHT FUTURE' నినాదంతో విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేశారు.
డ్రగ్స్ కలలను నాశనం చేస్తాయి (Drugs Destroy Dreams). విద్యార్థి జీవితంలో మంచి లక్ష్యం, కఠినమైన శ్రమ, ఆత్మవిశ్వాసమే నిజమైన ఉన్నత భవిష్యత్తుకు మార్గం.
— డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
పాల్గొన్న ప్రముఖులు
అఖిల్
ABVP ఖమ్మం కార్యకర్త
పృథ్వి
ABVP ఖమ్మం కార్యకర్త
డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
అభియాన్ నేత
శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు
భాగస్వాములు
నషా ముక్త భారత్ అవగాహన కార్యక్రమం — జి.ఎచ్.ఎస్ బోనకల్
నషా ముక్త యువ అభియాన్ కింద జి.ఎచ్.ఎస్ బోనకల్ వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో డా. గొంగూర వెంకటేశ్వర్లు (శ్రీ రక్షా హాస్పిటల్) ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాల గురించి వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తన మార్పులపై జాగరూకతతో ఉండాలని సూచించారు. 100 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు.
మాదక ద్రవ్యాలు యువతను శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి; తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తన మార్పులపై జాగరూకంగా ఉండాలి.
— డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
పాల్గొన్న ప్రముఖులు
డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
శ్రీ రక్షా హాస్పిటల్ — ముఖ్య అతిథి
శ్రీ అట్లూరి గోపిచంద్
హెడ్ మాస్టర్ (HM), జి.ఎచ్.ఎస్ బోనకల్
శ్రీ నరసింహారావు
ఉపాధ్యాయులు
శ్రీ బానోత్ రమేష్
ఉపాధ్యాయులు
శ్రీ సురేష్
ఉపాధ్యాయులు
విద్యార్థులు
జి.ఎచ్.ఎస్ బోనకల్
నషా ముక్త తెలంగాణ అభియాన్ ప్రారంభ ప్రతిజ్ఞా సభ — పెవిలియన్ గ్రౌండ్ పార్క్
జాతీయ 'నషా ముక్త యువ అభియాన్' పిలుపు మేరకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ పార్క్ వద్ద నిర్వహించిన ప్రతిజ్ఞా సభలో డా.GV బృందం మరియు బ్రహ్మకుమారీస్ సన్యాసిని రమాదేవి జీ భాగస్వామ్యమయ్యారు. యువత డ్రగ్స్ వ్యసనాన్ని విడిచి ధ్యానం, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని సందేశం అందించారు. పాల్గొనేవారందరూ ప్రతిజ్ఞ చేశారు.
మత్తు వ్యసనం మనసును, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ధ్యానం, నీతి, ఆత్మవిశ్వాసం — ఇవి యువతకు నిజమైన బలం. నషా ముక్త తెలంగాణ నిర్మాణం ప్రతి యువకుడి చేతుల్లోనే ఉంది.
— డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
పాల్గొన్న ప్రముఖులు
డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
శ్రీరక్ష హాస్పిటల్ అధినేత, అభియాన్ నేత
రమాదేవి జీ
బ్రహ్మకుమారీస్ సన్యాసిని (ముఖ్య అతిథి)
యువ వాలంటీర్లు & పౌరులు
ఖమ్మం నగర పాల్గొనేవారు
మానవ అక్రమ రవాణా & డ్రగ్స్ వ్యతిరేక అవగాహన శిబిరం — జి.ఎచ్.ఎస్ పండిల్లపల్లి
మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం మరియు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందర్భంగా జి.ఎచ్.ఎస్ పండిల్లపల్లి వద్ద డా.GV బృందం నిర్వహించిన శిబిరంలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణా ప్రమాదాలు, డ్రగ్స్ వ్యసనం గురించి వివరించారు. అందుకు పోలీసు అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు భాగస్వామ్యమయ్యారు.
మానవ అక్రమ రవాణా మరియు డ్రగ్స్ వ్యసనం — రెండూ యువతను నాశనం చేసే మహమ్మారులు. అవగాహనే నివారణకు మార్గం. ప్రతి విద్యార్థి 'నో' చెప్పే ధైర్యం నేర్చుకోవాలి.
— డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
పాల్గొన్న ప్రముఖులు
డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
శ్రీరక్ష హాస్పిటల్ అధినేత
ఎస్.ఐ నరేష్
చింతకాని సబ్-ఇన్స్పెక్టర్
శ్రీ శ్రీనివాస్
హెడ్ మాస్టర్ (HM), జి.ఎచ్.ఎస్ పండిల్లపల్లి
ఉపాధ్యాయులు & సిబ్బంది
జి.ఎచ్.ఎస్ పండిల్లపల్లి
విద్యార్థులు
Girl Child Empowerment Club సభ్యులు
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం — VITS ఇన్స్టిట్యూట్, ఖమ్మం
అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డా.GV ముఖ్య అతిథిగా పాల్గొని యువతను డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ సరదా కాదు... జీవితాన్ని నాశనం చేసే విషం! ఒకసారి అలవాటు అయితే కుటుంబం, ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడతాయి. నో చెప్పే ధైర్యమే నిజమైన స్టైల్. మీ కలలను గెలిపించండి... డ్రగ్స్ను కాదు!
— డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
పాల్గొన్న ప్రముఖులు
కోడి రెక్క ఉమా శంకర్
విట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ — నిర్వాహకులు
డా. గొంగూర వెంకటేశ్వర్లు (Dr GV)
శ్రీరక్ష హాస్పిటల్ అధినేత — ముఖ్య అతిథి
డా. కంబంపాటి నరసింహారావు
సైకియాట్రిస్ట్
కామర్తపు భానుచందర్
MY Bharat ఖమ్మం — అకౌంట్స్ ఆఫీసర్
డా. షేక్ ఏడుకొండలు
వైద్య నిపుణులు
అడ్వకేట్ సమల బాబు
న్యాయవాది
వార్తా పత్రికల ప్రచురణలు
Doctor's Voice
డా. GV సందేశం
డా. గొంగూర (GV)
MBBS · DA · MD · Emergency Medicine · Harvard Medical School
నమస్కారం, నేను డా. గొంగూర వెంకటేశ్వర్లు (GV). ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడిగా నా రోజువారీ అనుభవంలో, వైద్యశాలలోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువచ్చే యువత గణనీయంగా పెరుగుతున్నారు — వారిని తీసుకువస్తున్నది మత్తు వ్యసనమే. ఒక చిన్న అలవాటు మెదడును, కుటుంబాన్ని, యువకుడి భవిష్యత్తును నాశనం చేస్తుంది. దేశవ్యాప్త 'నషా ముక్త యువ అభియాన్' పిలుపును స్వాగతిస్తూ, శ్రీరక్ష హాస్పిటల్, ఖమ్మం తరపున 10 రోజుల ప్రత్యేక అవగాహన సిరీస్‌ను నిర్వహిస్తున్నాము. ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు ఈ సిరీస్ చూడగలగాలని, మరియు తమ ప్రియమైన వారితో షేర్ చేయగలగాలని కోరుకుంటున్నాను.
Join & Share


















